రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు
SRD: పది మండలాల్లో జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. జహీరాబాద్ మొగుడంపల్లిలో ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది తరలింపుతో పాటు పోలింగ్, కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు బందోబస్తు ఉండాలని సూచించారు.