'కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు'

'కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు'

NZB: భీమ్ గల్ మండల కాంగ్రెస్ పార్టీలో ఆదివారం చేరికలు జరిగాయి. పిప్రి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ అరిగేలా స్వామి, ఎన్నారై గుండా సాయిలు సహా పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.