'గిరిజన ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం'
BDK: మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలైన చంద్రాలగూడెం, రేగులగూడెం, బంజర, మల్లారం, లక్ష్మీదేవిపల్లి, ఉల్వనూరులో ఆయన ఇవాళ పర్యటించారు. పార్టీ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.