కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
BHPL: గణపురంలో ప్రఖ్యాతిగాంచిన కోటగుళ్లలో ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో సందర్శించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. కోటగుళ్ళకు విచ్చేసిన ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆలయ అర్చకులు ఏర్పాట్లు చేసి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.