VIDEO: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
KMR: గాంధారి మండలం పిస్కిల్ గుట్ట తండాలో ఈరోజు మండల పశువైద్యాధికారి వేణు ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువులకు చికిత్సలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వాతావరణం మార్పుల వలన పశువులు రోగాల బారిన పడకుండా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు వివరించారు.