వికారాబాద్‌లో పర్యటించిన విదేశీ ప్రతినిధుల బృందం
వికారాబాద్ పరిధిలోని పుల్మద్ది గ్రామాన్ని ఈజిప్ట్, గణ, మలేషియా, ఒమాన్, బంగ్లాదేశ్, శ్రీలంక విదేశాలకు చెందిన పదిమంది విదేశీ ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్డు, స్వయం శాఖ సంఘాల మహిళల అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన పనులపై జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ వారికి వివరించారు.