'వరి చెరుకు పొలాల్లో నీటిని పూర్తిగా తొలగించాలి'
AKP: వర్షాలకు వరి చెరుకు తోటల్లో చేరిన నీటిని పూర్తిగా తొలగించాలని వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీహరి, ఏవో సుమంత రైతులకు సూచించారు. శనివారం రాంబిల్లి మండలం గోకివాడ, మూలజంప గ్రామాల్లో పర్యటించి వరి, చెరుకు తోటలను పరిశీలించారు. వరి పైరు కోలుకోవడానికి ఎకరం విస్తీర్ణంలో 20 కిలోల యూరియా, 20 కిలోల పోటాష్ వేసుకోవాలన్నారు.