వందేమాతరం గీతం స్ఫూర్తి అజరామరం: ఎమ్మెల్యే
కోనసీమ: భరతమాతకు వందనం తెలియజేస్తూ బంకించంద్ర ఛటర్జీ రచించిన స్వాతంత్య్ర సమరనాదం వందేమాతరం స్ఫూర్తి అజరామరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బాలమందిరం, సాహితీ గోదావరి సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన కవి సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.