బాణాసంచా నిల్వలపై పోలీసుల ముమ్మర తనిఖీలు
KDP: కాకినాడలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా బాణాసంచా గోడౌన్లలో పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు లైసెన్సులు, భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.