మహానందిలో స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ

మహానందిలో స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ

NDL: మహానంది క్షేత్రంలో సోమవారం రాత్రి ఆలయ వేదపండితులు పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మంటపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలకు వేదపండితులు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకిపై ఆలయం పురవీధుల గుండా పల్లకిసేవను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మామిళ్లపల్లి రాఘవశర్మ, శరభయ్యశర్మ తదితరులు ఉన్నారు.