నేడు, రేపు భారత్‌లో పుతిన్ పర్యటన
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌లో ఇవాళ, రేపు పర్యటించనున్నారు. ఢిల్లీలో 30 గంటలు ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల సంబంధాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. భారత్‌తో పౌర అణు సహకార ఒప్పందానికి రష్యా చట్టసభ డ్యూమా ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ పర్యటనలో ఈ ఒప్పందంపై ఇరు దేశాధినేతలూ సంతకం చేయనున్నారు.