అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

W.G: నిడదవోలు నియోజకవర్గం సమిశ్రగూడెం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న అదే గ్రామానికి చెందిన ఎస్.వెంకట్రావును శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్టు ఎస్ఈబీ నిడదవోలు సీఐ కె. వీరబ్రహ్మం తెలిపారు. ఈ సందర్భంగా సీఐ వీరబ్రహ్మం మాట్లాడుతూ.. అతడి వద్ద నుంచి 16 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ దాడుల్లో ఎస్సై ఆర్. దొరబాబు, సిబ్బంది పాల్గొన్నారు.