పెన్షన్లు పునరుద్ధరించాలని వినతి

పెన్షన్లు పునరుద్ధరించాలని వినతి

KDP: వికలాంగుల పెన్షన్ల కోతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వికలాంగుల సంఘ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందులలో ఆందోళన చేశారు. ఈ మేరకు ఆర్డీవో చిన్నయ్యకు వినతిపత్రం అందజేశారు. కాగా, అర్హత ఉన్నప్పటికీ పలువురి వికలాంగుల పెన్షన్లు తగ్గించడమే కాకుండా కొందరి పేర్లు పూర్తిగా తొలగించారని చెప్పారు. అనంతరం అర్హత కలిగిన ప్రతి వికలాంగుడికి పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు.