యూఎస్ దౌత్యకార్యాలయంపై దాడి
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా దౌత్య కార్యాలయంపై ఇరాన్ మద్దతు గ్రూప్ ఇటీవల దాడులు చేసింది. విమానాశ్రయానికి సమీపంలోని అమెరికా స్థావరంపై ఈ దాడులు జరిగాయి. దీనికి సంబంధించి ఆ గ్రూప్ ఓ వీడియో విడుదల చేసింది. డ్రోన్లు ఎగురుతూ వీడియోలు రికార్డు చేశాయి. ఇందులో రాడార్ వ్యవస్థను ఓ డ్రోన్ బాంబులతో ధ్వంసం చేసింది. మార్చి 23న ఈ వీడియో విడుదల కాగా CNN దీనిని ధ్రువీకరించింది.