పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ నిరోధక టీకాలు

పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ నిరోధక టీకాలు

KDP: గోపవరం వద్ద ఉన్న ప్రభుత్వ పశువైద్య కళాశాలలో పెంపుడు జంతువులకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నట్లు కళాశాల అసోసియేట్ డీన్ సీహెచ్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా.. ఈనెల 6న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.