IPL మ్యాచ్.. మెట్రో సేవలు పొడగింపు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇవాళ SRH VS RR జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. రైళ్ల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడగించినట్లు ప్రకటించింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా క్రికెట్ అభిమానులు అన్ని కారిడార్ల నుంచి ఉప్పల్ స్టేడియంకు చేరుకోవచ్చని పేర్కొంది.