పుట్టగొడుగుల పెంపకంతో మెరుగైన ఉపాధి

పుట్టగొడుగుల పెంపకంతో మెరుగైన ఉపాధి

ATP: రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), డీఆర్‌డీఏ-వెలుగు సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, రైతులకు పుట్టగొడుగుల పెంపకంపై మూడు రోజుల శిక్షణ ముగిసింది. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి.గంగాధర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మూడు బ్యాచుల్లో 90 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కుటుంబ ఆదాయం పెంచుకునేందుకు ఇలాంటి ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.