హలో శుభోదయం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: దమ్మపేట మండలం నాచారం, సీతారాంపురం గ్రామపంచాయతీలో గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హలో శుభోదయం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వ్యక్తిగత గ్రామ అభివృద్ధి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారిని పరామర్శించి మెరుగైన వైద్యం కోసం తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు.