యనమలకుదురులో ప్రత్యేక పూజలు
కృష్ణా: యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకం, అభిషేకాలు ఘనంగా జరిగాయి. అనంతరం శాంతి కళ్యాణం, సాయి భక్తుల భజనలు ఆకట్టుకున్నాయి. స్వామివారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.