రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. పట్టించుకోని అధికారులు
NZB: సాలూర మండలం మంధర్నా మంజీర నుంచి ఇసుక అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. ఆదివారం సెలవు కావడంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోయింది. వడ్లు ఆరబెట్టిన రహదారుల మీదుగా ట్రాక్టర్లు వెళుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అక్రమ రవాణాను అరికట్టడంలో పోలీసుల నిఘా వైఫల్యం స్పష్టంగా చేస్తున్నారు. తక్షణమే ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.