'సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి'
VSP: కలెక్టరేట్లో ఇంటర్నెట్ సురక్షిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో JC గొబ్బిళ్ల విద్యాధరి పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. సైబర్ నేరాల పట్ల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఫేక్ లింకులు, OTP, మోసాలు, డీప్‌ఫేక్ స్కామ్‌లపై జాగ్రత్తగా ఉండాలన్నారు. మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలన్నారు.