కరెంటు షాక్‌కు గురై వ్యక్తి మృతి

కరెంటు షాక్‌కు గురై వ్యక్తి మృతి

ELR: టి.నర్సాపురం మండలం బొర్రంపాలెంలో పామాయిల్ గెలలు కోస్తున్న అంజిబాబు అనే కూలీ కరెంటు షాకుకు గురై మృతి చెందాడు. పామాయిల్ తోటలో గెలలు కోసేందుకు మంగళవారం వెళ్లి ఇలా విగతజీవిగా మారాడు. గెలలు కోస్తుండగా ఇనుప గెడ కత్తి పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తాకగా కరెంట్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.