భార్యను కత్తితో నరికిన భర్త

భార్యను కత్తితో నరికిన భర్త

బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని ఏల్చూరులో దారుణం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం అర్థరాత్రి నిద్రిస్తున్న భార్యపై భర్త కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.