VIDEO: వైయస్సార్ విగ్రహం తొలగింపు పై మండిపడ్డ నల్లగట్ల
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం వల్లంపట్లలో వైయస్సార్ విగ్రహం అర్థరాత్రి తొలగింపుపై వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ స్థలంలో 16 ఏళ్లుగా ఉన్న విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమన్నారు. అధికారులు కూటమి నేతల ఒత్తిడికి లోనై చట్టవిరుద్ధంగా వ్యవహరించారని శనివారం ఆయన ఆరోపించారు.