చికిత్స పొందుతూ గుర్తుతెలియని మహిళ మృతి

MDK: గుర్తుతెలియని మహిళా మృతి చెందిన ఘటన నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం కళ్లు కాంపౌండ్ వద్ద ఈనెల మూడవ తేదీన గుర్తు తెలియని మహిళ స్పృహ తప్పి పడిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఎవరైనా వృద్ధురాలని గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.