నందిగామలో ఎరువుల విక్రయ కేంద్రం ప్రారంభం

NTR: నందిగామలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణతో కలిసి ఘనంగా ప్రారంభించారు. రైతన్న బాగుంటేనే సమాజం బాగుంటుందని అన్నారు. పట్టెడన్నం పెట్టే రైతన్న శ్రేయస్సే కూటమి ప్రభుత్వ లక్ష్యంమని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ఆధునిక, సేంద్రియ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించటం జరుగుతుందని తెలిపారు.