RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

'ఆపరేషన్ సింధూర్'పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయని RSS చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సింధూర్ దేశ గౌరవాన్ని, ధైర్యాన్ని పెంచిందంటూ ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ బాధితులకు అసలైన నివాళి అంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశ త్రివిధ దళాలను ఆయన ప్రశంసించారు.