కాలనీలో తాగునీటి సమస్య తీర్చిన కౌన్సిలర్

కాలనీలో తాగునీటి సమస్య తీర్చిన కౌన్సిలర్

NRML: పట్టణంలోని 41వ వార్డులో తాగునీటి సమస్యను కాలనీవాసులు స్థానిక కౌన్సిలర్ సలీం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, అధికారులకు సమస్య గురించి వివరించారు. తక్షణమే స్పందించిన అధికారులు శానిటేషన్ సిబ్బందిచే బోరును బాగు చేయించారు. కాలనీలో తాగునీటి సమస్య తీర్చినందుకు కౌన్సిలర్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.