కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల ఆందోళన

NLR: కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లను తొలగించడాన్ని నిరసిస్తూ YCP పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగులు మంగళవారం నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలో నిరసన చేపట్టారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వ వైఖరి సరికాదని వారు నినాదాలు చేశారు. అనంతరం YCP దివ్యాంగుల విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.