'14 కిలోల గంజాయి స్వాధీనం'

VZM: రైల్వే ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్( విజయవాడ) ఆదేశాలతో విజయనగరం ప్లాట్ ఫాంలు తనిఖీలు చేస్తుండగా బరంపురం నుండి చెన్నైకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై బాలాజీరావు తెలిపారు. వారి నుండి సుమారు రూ.లక్ష విలువైన 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు చెప్పారు.