శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు

VZM: విజయనగరం గూడ్స్ షెడ్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో పద్మావతీ మాట్లాడుతూ.. గడిచిన 4నెలలకు గాను రూ.1,12,532 ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ రెయ్యి శంకర్ రెడ్డి, అర్చకులు సోమశేఖర్ శర్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.