ప్యారీ షుగర్ కంపెనీకి తాళం.. రోడ్డున పడ్డ కార్మికులు!
కాకినాడ రూరల్ వాకలపూడిలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ కర్మాగారం మార్చి 31వ తేదీన మూసివేసింది. 2014లో ఏర్పడిన ఈ పరిశ్రమలో 150 మంది పర్మనెంట్, 850 మంది కాంట్రాక్ట్ వర్కర్లు విధులు నిర్వర్తించారు. పరిశ్రమ లాకౌట్ ప్రకటించడంతో రోడ్డున పడ్డామని కార్మికులు ధర్నా చేశారు. కంపెనీని తెరవాలని, లాకౌట్ ప్రకటించిన నేపథ్యంలో కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.