CMRF చెక్కులను పరిశీలించిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పరిశీలించిన ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నిధి కింద పెండింగ్‌లో ఉన్న చెక్కుల వివరాలను హైదరాబాద్ సెక్రటేరియట్‌లో ఎమ్మెల్యే ఆదినారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెండింగ్ చెక్కులు త్వరలోనే ప్రజలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.