బెంజ్ సర్కిల్ వద్ద తప్పిన పెను ప్రమాదం
NTR: విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద బుధవారం అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. అతివేగంగా వచ్చిన లారీ నియంత్రణ కోల్పోయి ఓ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పాక్షికంగా ధ్వంసమవ్వగా, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కలుగజేసుకుని వాహనాలను క్రమబద్ధీకరించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేశారు.