నిలకడగా కొనసాగుతున్న పత్తి ధర..!

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ఠ ధర నిలకడగానే కొనసాగుతుంది. మంగళవారం రూ. 7,550 పలికిన పత్తి ధర ఈరోజు కూడా అంతే పలికింది. బుధవారం యార్డుకు 10 వాహనాల్లో 143 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠ ధర రూ.7,550, కనిష్ఠ ధర రూ.7,100 పలికింది.