VIDEO: సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలి: తిరుమలేష్
WNP: వనపర్తిలోని 24 వార్డులో నిబంధనలకు విరుద్ధంగా జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని బీజెపీ నాయకుడు గజరాజుల తిరుమలేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం సెల్ టవర్ నిర్మించే ప్రదేశంలో కాలనీవాసులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. తిరుమలేష్ మాట్లాడుతూ.. సెల్ టవర్ వల్ల ప్రజలకు రేడియేషన్ కారణంగా అరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.