నేడు వెలిగొండ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్న మంత్రి
ప్రకాశం: మంత్రి నిమ్మల రామానాయుడు నేడు వెలిగొండ ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. ఇటీవల గండిపడిన తీగలేరు కాలువ, సొరంగాల్లోకి వర్షపు నీరు చేరిన ప్రాంతాలను మంత్రి ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.