ఏడుపాయల అమ్మవారి దర్శనం
మెదక్: ప్రసిద్ద పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మకు ఆలయ అర్చకులు తెల్లవారు జామున మంజీరా నది జలాలతో అభిషేకం చేశారు. అనంతరం సహస్రనామార్చన, కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషాలంకరణ చేసి అమ్మవారి దర్శనం భక్తులకు కల్పించారు.