స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎస్సై

ప్రకాశం: మార్కాపురంలో పట్టణ ఎస్సై సైదు బాబు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక కంభం రోడ్డు దోర్నాల బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను ఆపి లైసెన్స్, వాహన పత్రాలు, పొల్యూషన్ ఇతర పత్రాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వాహనదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ వాహన పత్రాలతో పాటు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు.