వీసా సర్వీసు ఫీజును పెంచిన న్యూజిలాండ్
వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీసు ఫీజును పెంచుతున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో ఈ పెంపు అమల్లోకి రానుంది. భారత్ సహా 25 దేశాల్లో ఈ పెంపును చేపడుతున్నట్లు వెల్లడించింది. నిర్వహణపరమైన వ్యయాలు, ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.