ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే

KMR: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సెషన్స్ ముగియడంతో జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు కాంతారావు జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో గల క్యాంపు కార్యాలయంలో ఆదివారం నాడు ప్రజలతో మమేకమై వారి అర్జీలను స్వీకరించారు. గతంలో చెప్పిన విధంగా ప్రజా దర్బార్ నుండే ప్రజాపాలన చేస్తానని చెప్పారు. అదేవిధంగా మరో రెండు రోజులు ఇక్కడే ఉంటానని తమ సమస్యలు నేరుగా తెలియజేయాలని సూచించారు.