వ్యభిచార గృహంపై దాడి.. వ్యక్తి అరెస్ట్
GNTR: తెనాలిలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో వన్ టౌన్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గృహంలో ఓ మహిళను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను 'స్వధార్ హోం'కు తరలించారు. విటుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.