ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

 NLR: రావూరు గ్రామంలోని సచివాలయంలో BPCL పరిశ్రమ భూసేకరణపై ఇవాళ ప్రజాదర్బార్ నిర్వహించారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ పాల్గొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఎకరాకు రూ. 15 లక్షల పరిహారం ఇచ్చిందని, దానిని రూ. 20 లక్షలకు పెంచేలా ప్రభుత్వంతో మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై చర్చించారు.