పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం
TPT: ఏర్పేడు మండలం ఆమందూరు, మేర్లపాక పంచాయతీల్లో అంటు వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు బుధవారం నిర్వహించారు. పంచాయతీ అధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారం పంచాయతీ కార్మికులకు అందజేయాలని కోరారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు పెరిగి రోగాలు వస్తాయని హెచ్చరించారు.