33వ వార్డు కౌన్సిలర్‌ని సత్కరించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

33వ వార్డు కౌన్సిలర్‌ని సత్కరించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 33వ వార్డులో 100 శాతం ఇంటి పన్ను వసూలైంది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్ కొండ వర్షిణి- నరేష్‌లను, వార్డు ఆఫీసర్ అలేఖ్యను మున్సిపల్ ఛైర్‌పర్సన్ జిందం కళా-చక్రపాణి, మున్సినల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ పాషా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ దార్ల సందీప్, డీఈ వాణి, రెవెన్యూ ఆఫీసర్ రామ్మోహన్ రాయ్, తదితరులు పాల్గొన్నారు.