విద్యార్థులకు పరీక్ష ఫీజు కట్టనున్న కేంద్ర మంత్రి
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభవార్త చెప్పారు. టెన్త్ ఎగ్జామ్ ఫీజు పూర్తిగా చెల్లించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ తానే స్వయంగా పరీక్ష ఫీజు చెల్లిస్తానని తెలిపారు.