యుద్ధం.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంలో తామే గెలిచామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తాము ఇరాన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్, కమ్యూనికేషన్ వ్యవస్థను నాశనం చేశామన్నారు. టెహ్రాన్‌తోపాటు ఆ దేశంలోని అనేక ప్రాంతాల్లో తమ ఫ్లైట్లు స్వేచ్ఛగా ఎగురుతున్నా వాళ్లు ఏం చేయలేకపోతున్నారని చెప్పారు. ఇరాన్ నాయకత్వం పూర్తిగా బలహీనపడిందన్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నామని, డీల్ చేసుకుంటామన్నారు.