బస్తీ దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే
గద్వాల పట్టణంలోని 16వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని గురువారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రారంభించి, అదే వార్డులో బస్తీ దవాఖాన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు యోగా, వాకింగ్ చేయడానికి పార్కులను అన్ని హంగులతో తీర్చిదిద్దామని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.