జిల్లా కలెక్టర్‌ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు

జిల్లా కలెక్టర్‌ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు

MHBD: జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌ను ఇవాళ పెద్దవంగర మండల బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సీసీ రోడ్డు, అంగన్వాడీ భవనాలు, మహిళా సమైక్య భవనాల మంజూరులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ పెండింగ్ పనులను తక్షణమే మంజూరు చేసి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.