గంజాయి మొక్క పెంచిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

PDPL: రామగుండం NTPC పోలీస్ స్టేషన్ పరిధి మేడిపల్లి గ్రామంలోని ఓ ఇంటిలో 5 గంజాయి మొక్కలను పోలీసులు కనుగొన్నారు. SI ఉదయ్ కిరణ్ తన సిబ్బందితో కలిసి వెళ్లి నిషేధిత గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాటిని పెంచిన కార్తీక్ అనే యువకుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిషేధిత గంజాయిని కలిగి ఉన్నా, సరఫరా చేసినా, చర్యలు తప్పవని పేర్కొన్నారు.